
గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమం బలోపేతం
హన్మకొండ : బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ విజయవంతానికి కృషి చేసిన, సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బంద్ తెలంగాణ ఉద్యమం తరహాలో జరిగిందని, ఈ బంద్ బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనన్నారు. బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి బీసీలను చైతన్య పరుస్తామన్నారు. ఓటు మనదే.. సీటు మనదే.. రాజ్యాధికారం మనదే అనే నినాదంతో బీసీలందరినీ సంఘటితం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు బీసీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ చైర్మన్ దొడ్డపెల్లి రఘుపతి, వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మల శోభారాణి, కోఆర్డినేటర్లు గాజు యుగంధర్ యాదవ్, తంగళ్లపల్లి రమేశ్, ప్రచార కార్యదర్శి అరేగంటి నాగరాజు గౌడ్, చాగంటి రమేశ్ పాల్గొన్నారు.
టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్