
అన్నదానం
హన్మకొండ కల్చరల్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్‌లో అన్నదానం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్, కమిటీ స్టేట్ సెక్రటరీ దుశెట్టి భాస్కర్, జోనల్ సెక్రటరీ కంకటి సాగర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బయాల సంతోష్‌కుమార్, పీఆర్వో బాలరాజు, అజయ్‌గౌడ్, సభ్యులు జితేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.