
అనుమానాస్పద స్థితిలో బీఆర్‌ఎస్ నాయకుడి మృతి
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ల్యాదేళ్ల రాజు(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం అతడి మృతదేహం ఇదే డివిజన్‌లోని మొగిలిచర్ల శివారులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బంధువులు, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. గోనె సంచుల వ్యాపారం చేస్తున్న రాజు శనివారం మధ్యాహ్నం హసన్‌పర్తి పీఎస్‌లో పని ఉందంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. మరుసటి రోజు అతడి మృతదేహం మొగిలిచర్ల శివారులోని శ్మశానవాటిక సమీపంలో లభ్యమైంది. తన భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తోపాటు మృతుడి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా, ఘటనాస్థలిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రాజు అంత్యక్రియలకు రూ. 50వేలు అందజేశారు.