
కార్తీక వనభోజనంలో పాల్గొనండి
హన్మకొండ కల్చరల్ : నవంబర్ 16న నిర్వహించే కార్తీక వనభోజనంలో విశ్వబ్రాహ్మణుల పాల్గొనాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి కోరారు. వరంగల్ రంగశాయిపేట దూపకుంట మై మాస్టర్ స్కూల్ వెనుక ఉన్న మామిడి తోటలో నిర్వహించే వనభోజన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విశ్వబ్రాహ్మణుల పాల్గొనాలని పేర్కొన్నారు. ఆదివారం రంగశాయిపేటలో వనభోజనాల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెందోట సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్తీక వనభోజనాల కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.