హన్మకొండ చౌరస్తా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నుంచి అశోకా జంక్షన్ వరకు దిష్టిబొమ్మలను శవయాత్రగా తీసుకొచ్చి దహనం చేశారు. ఈసందర్భంగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు రాజ్యాంగం, గవర్నర్ అంటే కనీస గౌరవం లేదన్నారు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీని హుందాగా నడిచేలా చూసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు కుమార్‌యాదవ్, మంద రాకేశ్, అంబేడ్కర్ రాజు, అంకూస్, సంపత్, గణేశ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.