ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదనే మనస్తాపంతో.. | A Youngster In Hanamakonda Demands Indiramma Housing | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదనే మనస్తాపంతో..

May 30 2025 3:45 PM | Updated on May 30 2025 5:39 PM

A Youngster In Hanamakonda Demands Indiramma Housing

హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 2 లక్షల 10 వేల ఇండ్లను ఫైనల్ చేశారు. ఫైలేట్ ప్రాజెక్టులో 47 వేల ఇండ్లకు గాను 24 వేల ఇండ్లను ప్రారంభించారు. అయితే తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. 

తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ తన పేరు జాబితాలో లేదంటూ ఆవేదన చెందిన హనుమకొండ రామ్ నగర్ కు  చెందిన పాషా అనే యువకుడు హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్ ఎక్కాడు. తనను ప్రభుత్వం మోసం చేసిందంటూ హోర్డింగ్ చివర వరకూ ఎక్కి తనకు న్యాయం చేయాల్సిందేనని నిరసన స్వరం వినిపించాడు.  ఇలాగైనా ప్రభుత్వ పెద్దలు తన మాట  ఆలకించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇలా హోర్డింగ్ ఎక్కింది హోంగార్డు లతీఫ్ కుమారుడిగా పోలీసులు తేల్చారు.

Advertisement
 
Advertisement
Advertisement