అక్రమ నిర్మాణాల రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీఓ వాసుచంద్ర
ఖిలా వరంగల్ : బీఆర్‌ఎస్ కార్యాలయానికి కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలితే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని వరంగల్ ఆర్డీఓ వాసుచంద్ర హెచ్చరించారు. ఈమేరకు గురువారం వరంగల్ రంగశాయిపేటలోని ఉర్సు శివారులో ఉన్న పుల్లయ్యకుంటను ఖిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, బల్దియా అధికారులతో కలిసి ఆర్డీఓ సందర్శించారు. గత ఏడాది ప్రభుత్వ అనుమతితో బీఆర్‌ఎస్ పార్టీకి కేటాయించిన ఎకరం స్థలంతోపాటు అనుమతిలేని నిర్మాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, చెరువు మ్యాపును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ వాసుచంద్ర మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలానికి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు సర్వేలో తేలితే నోటీసులు జారీచేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బల్దియా ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ టి.అవినాష్, చైన్‌మెన్ ఎండీ.అన్వర్, సామాజిక కార్యకర్త ఎండీ.ఫసీ తదితరులు పాల్గొన్నారు.
● వరంగల్ ఆర్డీఓ వాసుచంద్ర
● పుల్లయ్యకుంట మ్యాప్, ప్రైవేట్ వ్యక్తుల డాక్యుమెంట్ల పరిశీలన


