మహబూబాబాద్ రూరల్ : మూగజీవి ఉడుమును పట్టుకుని ఉన్న ఓ యువకుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు.. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం అటవీ శాఖ మహబూ బాబాద్ రేంజ్ కార్యాలయంలో డోర్నకల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రేణుక కేసు వివరాలు వెల్లడించారు. కురవి మండలానికి చెందిన జీ రఘు తన చేతిలో ఓ ఉడుమును పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను ‘ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యుడు గౌతమ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు పంపించి ఫిర్యాదు చేశా రు. వారి ఆదేశాల మేరకు డోర్నకల్ ఫారెస్ట్ రేంజ్ అఽ దికారి రేణుక, సెక్షన్ అధికారి శ్రీనివాస్ .. రఘును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.