
ఖిలా వరంగల్ : ఎమ్మార్పీకే ఈపాస్ ద్వారా ఎరువులు విక్రయించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఖిలా వరంగల్ మండల పరిధిలోని పీఏసీఎస్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్‌షాపులను జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి ఉషాదయాళ్‌తో కలిసి మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రైతులకు విక్రయిస్తున్న తీరును ఆమె పరిశీలించారు.
ఎన్‌సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి
మామునూరు : దేశానికి యువతే బలమని, ఎన్‌సీసీ శిక్షణ పొందిన కేడెట్లకు ఏ, బీ, సీ సర్టిఫికెట్లతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, క్రమశిక్షణ, సామాజిక సేవ, దేశభక్తి మరింత పెంపొందుతుందని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మామునూరులోని పీటీసీ ప్రాంగణంలో ఎన్‌సీసీ 10వ బెటాలియన్ వరంగల్ క్యాంపు కమాండెంట్ కల్నల్ అజయ్‌నంద కందూరి, గ్రూప్ కమాండెంట్ కల్నల్ సచిన్ నింబాల్కర్ వీరచక్ర పర్యవేక్షణలో ప్రారంభమైన ఎన్‌సీసీ శిక్షణ క్యాంపు మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, కెప్టెన్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య