కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ ఈనెల 26 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాధిక మంగళవారం తెలిపారు. ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 26, 29 తేదీల్లో, అక్టోబర్3న, 5, 10, 12వ తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25, 27, 30వ తేదీల్లో, అక్టోబర్4, 6న, 9న,11వ తేదీల్లో జరగుతాయని తెలిపారు.
23 నుంచి ఎంపీఈడీ
నాలుగో సెమిస్టర్ పరీక్షలు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్‌ను మంగళవారం పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. ఈనెల 23, 25, 27 తేదీల్లో నిర్వహిస్తారని తెలిపారు. అలాగే, బీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23, 25, 27, 29 తేదీల్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ రాధిక తెలిపారు.