విభిన్నం.. వినూత్నం | - | Sakshi
Sakshi News home page

విభిన్నం.. వినూత్నం

Sep 20 2023 1:10 AM | Updated on Sep 20 2023 1:10 AM

- - Sakshi

గణేశ్‌ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వరంగల్‌ నగరంలో ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసిన గణేశ్‌ విగ్రహాలు ఆలోచింపజేస్తున్నాయి. అలాంటిదే హనుమకొండలోని సుధానగర్‌లో నూతన గజానణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నగరంలో హెల్మెట్‌ ధరించకుండా కుటుంబ సమేతంగా బైక్‌పై వెళ్తున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్‌ పోలీస్‌ వేషంలో ఉన్న ఓ ఎలుక ఆపగా, వినాయకుడు హెల్మెట్‌ను అందిస్తూ ప్రాణాలకు భరోసా ఇస్తున్న వినాయకుడి విగ్రహం ఓ వైపు ఏర్పాటు చేయగా, భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రజా దర్బార్‌లో బాధితుడినుంచి ఫిర్యాదు పత్రాన్ని స్వీకరిస్తున్నట్లున్న మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒకే మంటపంలో ఉన్న ఈ రెండు విగ్రహాలు భక్తులను ఆలోచింపజేయడంతోపాటు ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా దాల్చినచెక్క, డ్రైపూట్స్‌, దూది రాఖీలు, చంద్రయాన్‌–3 మోడల్‌లో ప్రతిష్ఠించారు.

– హన్మకొండ చౌరస్తా/సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు

హనుమకొండ, వరంగల్‌

బాధితుడినుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ 
వేషధారణలోని వినాయకుడు1
1/3

బాధితుడినుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ వేషధారణలోని వినాయకుడు

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement