ఆగస్టులో బీ–2 బిజినెస్‌ ఎక్స్‌పో | - | Sakshi
Sakshi News home page

ఆగస్టులో బీ–2 బిజినెస్‌ ఎక్స్‌పో

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

ఆగస్టులో బీ–2 బిజినెస్‌ ఎక్స్‌పో ఈనెలాఖరు వరకు దస్తావేజు లేఖరుల ధర్నా కారు ఢీకొని వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

గుంటూరు మెడికల్‌: గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్‌న్స్‌లో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న బీ–2 బిజినెస్‌ ఎక్స్‌పో–2026 పోస్టర్‌ను బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు జూపూడి రంగరాజు ఆదివారం అమరావతిరోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో కుటీర పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషించగా, నేడు యువత ఆధునిక సాంకేతికతతో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తూ పారిశ్రామిక రంగంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఈ ఎక్స్‌పోలో పాల్గొని తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాలని కోరారు. బీ–2 ఎక్స్‌పో అధ్యక్షుడు కుమ్మమూరి శ్రీధర్‌బాబు, కార్యదర్శి బి.హేమంత్‌, కోశాధికారి కె.బాలకష్ణ, ధృతి హాస్పిటల్స్‌ సీఈవో డాక్టర్‌ రేవూరి హరికష్ణ మాట్లాడుతూ యువత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో సుమారు 150 ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, సేవా సంస్థలు పాల్గొంటాయన్నారు. స్టాల్‌ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నిర్వాహకుల ద్వారా ముందస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్స్‌పో కన్వీనర్‌ ఎం.రవిశంకర్‌, కో–కన్వీనర్‌ కె.బద్రి, ఏపీబీఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు కోనూరు సతీష్‌శర్మ, కో కన్వీనర్‌ అ రమణమూర్తి, ప్రముఖ జీఎస్టీ అడ్వకేట్‌ సుందర రామశర్మ, ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెలగలేటి గంగాధర్‌, హనుమప్రసాద్‌, రామకృష్ణ పరమహంస తదితరులు పాల్గొన్నారు.

సంఘం జిల్లా అధ్యక్షుడు మునగాల రవి

గుంటూరు వెస్ట్‌: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీనియర్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ మునగాల రవి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక గుంటూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆవరణలో నిరసన కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ధర్నా కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని రోజులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రైవేటీకరణను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జీఓ నెంబర్‌ 396 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.

నూతన కార్యవర్గం..

గుంటూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా సిద్ధం ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడిగా మునగాల రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.జయరాజు, ప్రధాన కార్యదర్శిగా ఏనుగుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా వి.శేషిరెడ్డి, యలగాల రామకృష్ణ, బి.గంగాధరరావు, సహాయ కార్యదర్శులుగా జి.ఉదయ్‌చంద్ర కుమార్‌, మక్కెన ప్రకాష్‌, ఎస్‌.మహేష్‌, లీగల్‌ అడ్వైజర్‌గా మల్లాది చంద్రశేఖర్‌, కోశాధికారిగా కత్తి సాంబిరెడ్డి, సంయుక్త కోశాధికారిగా ఎ.పిచ్చయ్య, కార్యవర్గ సభ్యులుగా బి.వెంకట భద్రయ్య, టి.శ్రీధర్‌, ఏ.అనిల్‌ కుమార్‌, దిడుగు చంద్రశేఖర్‌, బి.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దుగ్గిరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుగ్గిరాలకు చెందిన కుర్రా నాగయ్య(59), తరుణ్‌ కలసి బైకుపై తెనాలి వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని కారు బైకుని ఢీ కొట్టింది. నాగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తరుణ్‌ని అంబులెన్స్‌లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

లక్ష్మీపురం(తిరువూరురూరల్‌): ఇబ్రహీంపట్నం–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్‌ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్‌(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్‌ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement