తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ కనకదుర్గ వారధి, రేపల్లె కరకట్ట వెంబడి ప్రాతూరు గ్రామం వద్ద గుంటూరు ఈగల్‌టీమ్‌కు గంజాయి విక్రయిస్తూ.. సేవిస్తున్నారని సమాచారం వచ్చింది. ఈ నేపధ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కృష్ణాతీరంలో ఈగల్‌టీమ్ నిఘా ఏర్పాటు చేసి గంజాయి సేవిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. సోమవారం విచారణ చేపట్టిన తాడేపల్లి సీఐ వీరేంద్ర వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురితోపాటు మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన కీలక వ్యక్తి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.
ప్రాతూరులో గంజాయి గుప్పు
Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM
● నిఘా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్
● ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. తాడేపల్లి పీఎస్‌లో అప్పగింత
● విచారణలో కదులుతున్న గంజాయి డొంక
● పోలీసుల అదుపులో మరో ఆరుగురు అనుమానితులు
● కీలక వ్యక్తుల గురించి అన్వేషణ ● ఇదే సమయంలో గంజాయి అందజేస్తున్న ప్రాతూరుకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ యూసఫ్‌గూడాలో నివాసముంటున్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి సేవిస్తున్న నలుగురిలో ముగ్గురు యువకులు పశువుల కాపరులు కాగా, ఓ యువకుడు ఢిల్లీలో డాక్టర్ చదువుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇతని ద్వారానే ప్రాతూరుకు గంజాయి వస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో కృష్ణలంకకు చెందిన మరో యువకుడు గంజాయి సరఫరా చేస్తున్నాడని సమాచారం వచ్చింది. ఇతనితో పాటు ప్రాతూరులో ఉన్న మరో యువకుడికి కూడా కృష్ణలంకు చెందిన యువకుడు గంజాయి సరఫరా చేయడంతో ఆ యువకుడు ఇక్కడ చిన్నపొట్లాలుగా ఏర్పాటు చేసి వాటిని ప్రాతూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నట్లు ప్రాతూరులో పలువురు చర్చించుకుంటున్నారు.
● పోలీసులు వీరిని గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు విచారిస్తున్న వారిలో ముగ్గురిపై గతంలో గంజాయి కేసులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులను వివరణ కోరగా, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ప్రస్తుతానికి అనుమానితులను విచారిస్తున్నామని, అసలు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement


