న్యూస్‌రీల్
యథేచ్ఛగా సాగుతున్న స్థిరాస్తి వ్యాపారం రూ. లక్షల్లో జేబులు నింపుకొంటున్న అక్రమార్కులు తీవ్ర ఆందోళనలో స్థానిక ప్రజలు అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు శూన్యం బడానేతల హస్తం ఉందని విమర్శలు
సమస్యల నడుమ రహదారి..
సకాలంలో కౌంటర్ వేస్తే మేలు
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
సౌర ప్యానళ్ల వితరణ
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో తొమ్మిది బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ సహా ఆరు క్రీడా అంశాలలో వసతులు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలోని క్రికెట్ మైదానాన్ని ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి చేస్తామన్నారు. రూ.170 కోట్లతో మొత్తం స్టేడియం డీపీఆర్‌లు తయారు చేశారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, తూర్పు శాసన సభ్యులు నసీర్ అహ్మద్‌లు మాట్లాడారు. కమిషనర్ మయూర్‌అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీఎస్‌డీఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.
సత్తెనపల్లి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్‌కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పరివర్తన మానసిక దివ్యాంగుల పాఠశాలను గురువారం సత్తెనపల్లి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్,)జె. సుజన్‌కుమార్ సందర్శించారు. ముందుగా అక్కడ ఉన్న విద్యార్థుల వసతి గృహం, వంటశాలను పరిశీలించారు. ఆహార నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి.ఎల్. కోటేశ్వరరావు, గంటా వెంకటశివ, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, పాఠశాల నిర్వాహకుడు కొరబండి కిషోర్‌బాబు ఉన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 536.60 అడుగులకు చేరింది. ఇది 181.3178 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 8,473, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది.
తాడేపల్లి రూరల్ : రాజధాని ముఖద్వారమైన మంగళగిరి నియోజకవర్గంలో సీతానగరంలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కొంతమంది నాయకులు కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రూ. లక్షల సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. ఇదే తరహాలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం బోటు యార్డు సమీపంలో రైల్వే భూములను సైతం ప్లాట్లుగా మార్చి రెండు, మూడు సెంట్ల చొప్పున అమ్మేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్ధలో ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అది ఆసరాగా చేసుకున్న సదరు నాయకులు రెచ్చిపోయి ఒక ప్లాట్‌ను రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీతానగరం బోటు యార్డు రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు గతంలో తాడేపల్లి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో రహదారి ఏర్పాటు చేశారు. ఆ రహదారికి కుడిభాగంలో కొంత రైల్వే స్థలం, మరికొంత ప్రభుత్వ స్థలం, దాని పక్కనే ప్రైవేటు స్థలం ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలను టార్గెట్ చేసి ఈ భూములను అమ్మేస్తున్నారు.
వలస వచ్చినవారే టార్గెట్
ప్రకాశం, శ్రీకాకుళంలతో పాటు ఇతర జిల్లాల నుంచి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారిని సదరు నాయకులు టార్గెట్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి ఎటువంటి ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ నమ్మబలికి సెంటు భూమి ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు అమ్మేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత మూడవ విడత, నాల్గవ విడతలో మీకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుందంటూ నమ్మిస్తున్నారు. కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకుంటుంటే అక్కడికి వెళ్లిన సచివాలయ సిబ్బందిని నాయకులు సంప్రదిస్తున్నారు. మాట వినకపోతే బెదిరించి కొనుగోలు చేసిన వారి చేత ఇళ్లను నిర్మింపజేస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ కోర్టు కేసులతో కునారిల్లుతుంది. వందల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ వేయడంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ బాధితులకు సరైన న్యాయం జరగకపోవడంతోపాటు కొన్ని సందర్భాల్లో కార్పొరేషను ఆదాయం, ఆస్తులు కూడా పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సంవత్సరం మార్చి మొదటి వారం వరకు మొత్తం 297 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా టౌను ప్లానింగ్ విభాగంలో 145 కేసులు, ఇంజినీరింగ్ సెక్షనులో 62, రెవెన్యూ సెక్షనులో 42, పబ్లిక్ హెల్త్ సెక్షనులో 20, జనరల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షనులో 17, ఎలక్షన్‌ను సెల్ 8, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఉపా సెల్, ఎడ్యుకేషనను ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
కౌంటర్ వేయని కేసులు 150
మొత్తం 295 పెండింగ్ కేసుల్లో 150 కేసుల్లో అసలు కౌంటర్ దాఖలు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టౌను ప్లానింగ్ సెక్షనులో 145 కేసులకు 75, ఇంజినీరింగ్ విభాగంలో 62 కేసులకు 42, రెవెన్యూ సెక్షన్‌నులో 42 కేసుల్లో 10, పబ్లిక్ హెల్త్ విభాగంలో్ 20 కేసులకు 7, జనరల్ ఎస్టాబ్లిష్‌మెంట్ 17 కేసులకు 7 కేసుల్లో కౌంటర్ లేదు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఒక కేసు ఉంటే దీనికీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఎలక్షనను విభాగంలో కూడా 8 కేసులు పెండింగ్‌లో ఉంటే ఒక్క దానికి కూడా కౌంటర్ వేయలేదు.
అధికంగా ఈ అంశాలపైనే..
టౌను ప్లానింగ్ విభాగంలో ఎక్కుగా రోడ్డు విస్తరణకు సంబందించి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భవనాలు ఎఫెక్ట్ అయ్యే వారు కూడా ఎక్కువగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ సెక్షనులో బిల్లులు చెల్లింపు, టెండరింగ్ విషయంలో కేసులు నమోదు అయ్యాయి. రెవెన్యూ సెక్షననులో షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంఽధించి ట్యాక్స్ విషయంలో, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో లీజు గడువు పూర్తయినప్పటికీ వాటిని ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయించారు.
నగరపాలక సంస్థ కార్యాలయం
1
బోటు యార్డ్ రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు సుమారు 40 అడుగల వెడల్పుతో రహదారిని ఏర్పాటు చేశారు. ఆ రహదారిని సైతం ఆక్రమించడంతో అక్కడ పట్టా భూములు కొనుక్కొని నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి మురుగునీరు పారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ జరిపి ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మంగళగిరి టౌన్: చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయానికి హైదరాబాద్ ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి రూ. 5.5 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ప్యానళ్లను గురువారం అందజేశారు. సుబ్బారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శరణాలయంపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఆయన ప్రారంభించారు. బాలలకు అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు దొంతిరెడ్డి గాంధీ, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రుక్మాంగరెడ్డి, వెంకటరామిరెడ్డి, లంకా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్ వేయకపోవడం వలన కార్పొరేషను ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అభివృద్ది పనులు నెలల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఉదాహరణకు కాకుమానువారి తోట (కార్మిక శాఖ స్థలం) రోడ్డు వేయకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంది. రోడ్డు టెండర్‌ను కాంట్రాక్టర్ అడ్డదారిలో దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వర్కును ఇంజినీరింగ్ అధికారులు రద్దు చేశారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు నెలల తరబడి తేలకపోవడంతో ఆ రోడ్డు అలాగే ఆగిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో కోర్టు కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని నగర వాసులు కోరుతున్నారు.


