సాహిత్యంలో రారాజు కొసరాజు | - | Sakshi
Sakshi News home page

సాహిత్యంలో రారాజు కొసరాజు

Dec 16 2025 4:26 AM | Updated on Dec 16 2025 4:26 AM

సాహిత్యంలో రారాజు కొసరాజు

సాహిత్యంలో రారాజు కొసరాజు

● డాక్టర్‌ గరికపాటి మాట్లాడుతూ రైతు అన్నదాత అయితే కవి జ్ఞానదాత అని అన్నారు. సరస్వతిదేవి కటాక్షంతో సినీ గేయ రచయితగా, సాహిత్యంలో గ్రంథకర్తగా కొసరాజు ప్రఖ్యాతిగాంచారని పేర్కొన్నారు. ● సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ డాక్టర్‌ కొసరాజు రచనలు తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ● మనసు ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మన్నం వెంకటరాయుడు మాట్లాడుతూ తమ ఫౌండేషన్‌ ద్వారా మూడు కోట్ల పేజీల సాహిత్యాన్ని, రచనలను డిజిటలైజేషన్‌ చేశామని చెప్పారు. ● సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా గత పదేళ్లుగా తెలుగు సాహిత్య వెలుగులను ప్రపంచానికి తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ● సినీ నటుడు సుమన్‌ మాట్లాడుతూ కొసరాజు అనేక మంచి గీతాలను అందించారని అన్నారు.

నగరంపాలెం(గుంటూరు ఈస్ట్‌) : కొసరాజు సాహిత్యం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్‌ శిఖరమంతా ఉన్నతంగా వెలుగుతుందని మహా సహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు. సోమవారం గుంటూరులోని జేకేసీ కళాశాల సమావేశ మందిరంలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక, మనసు ఫౌండేషన్‌ సంయుక్తంగా సాహిత్య పరిశోధకులు పారా అశోక్‌కుమార్‌ నేతృత్వంలో రూపొందిన కొసరాజు సర్వలభ్య రచనల సంకలనం పుస్తకావిష్కరణ సభ జరిగింది. తొలుత ఈ గ్రంథాన్ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం కొసరాజు జీవిత మాలికపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అతిథులు ప్రారంభించి, కొసరాజు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.

కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ జాగర్లమూడి మురళీమోహన్‌, పత్తిపాటి దేవాక్షమ్మ, చలసాని అనురాధ, కస్తల పద్మ, డాక్టర్‌ కొసరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement