విజ్ఞాన్ యూనివర్సిటీకి పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరు
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఢిల్లీలోని నావల్ రీసెర్చ్ బోర్డ్ (ఎన్‌ఆర్‌బీ) – డీఆర్‌డీఓ నుంచి ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరైనట్లు వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ సోమవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్య, భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్ – ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీకి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కాలి సంజయ్‌లకు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పైలెట్ స్కేల్ టెస్టింగ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో షీట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎన్‌హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ ఫ్రమ్ సీ వాటర్ బిట్టెర్న్స్’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ పరిశోధనకు రూ. 74.35 లక్షల గ్రాంట్‌నుఎన్‌ఆర్‌బీ–డీఆర్‌డీఓ మంజూరు చేసిందని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా సముద్ర జలాల్లో మిగిలే బిట్టెర్న్స్ నుంచి అధిక స్వచ్ఛత గల ఎన్‌హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ తయారీకి వినూత్నమైన సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్యలను చైర్మన్ లావు రత్తయ్య, సీఈఓ మేఘన కూరపాటి అభినందించారు.


