అమరజీవికి జిల్లా ఎస్పీ ఘననివాళి
నగరంపాలెం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పొట్టిశ్రీరాములు కీలకపాత్ర పోషించారన్నారు. ప్రాణాలను సైతం ఏమాత్రం ఖాతారుచేయకుండా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల సాధనకై అహింసాయుత దీక్షతో పోరాడి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, కార్యాలయ ఏఓ వెంకటేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులు పలువురు సీఐలు, ఆర్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్జీ రంగా వర్సిటీలో ...
గుంటూరు రూరల్: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మిదేవి తెలిపారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకుని నగర శివారు లాంఫాంనందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, పీజీ డీన్ డాక్టర్ ఏవీ రమణ, కంట్రోలర్ డాక్టర్ బి. ప్రసాద్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎ. మణి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, లైబ్రేరియన్ జి. కరుణ సాగర్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమరజీవికి జిల్లా ఎస్పీ ఘననివాళి


