అయినవారికి దోచిపెట్టేందుకే నిర్ణయాలు
ప్రైవేటీకరణ పేరుతో మెడికల్ కళాశాలలను అప్పనంగా తన వారికి కట్టబెట్టేందుకు బాబు చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్థమైనందునే నేడు కోటి సంతకాల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రైవేటు రంగంలో ఉన్న తన మద్దతుదారులకు దోచిపెట్టేందుకే సీఎం చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేదవాడికి ఉచితంగా వైద్యం, వైద్య విద్య అందాలంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలి.
– దాసరి రాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు


