చంద్రబాబు పాలనలో విద్యా రంగం నిర్వీర్యం
చేబ్రోలు: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, ఆన్‌లైన్ యాప్‌ల విధానంతో ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) గుంటూరు జిల్లా 51వ కౌన్సిల్ సమావేశం ఆదివారం చేబ్రోలులో ఘనంగా జరిగింది. స్థానిక ఆర్వీటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖరరావు అధ్యక్షత వహించారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా జాతీయ, ఎస్‌టీఎఫ్‌ఐ, యూటీఎఫ్ జెండాలను నారాకోడూరు హైస్కూల్ హెచ్‌ఎం ఎం. ఏడుకొండలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభుదాసు, సీనియర్ నాయకులు ఆర్వీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. యూటీఎఫ్ బలోపేతం, ిసీపీఎస్ రద్దు, ఉపాధ్యాయుల సంక్షేమం, టెట్ అర్హత పరీక్ష, బోధనేతర పనులతో విద్యార్థికి దూరమవుతున్న ఉపాధ్యాయుడు, అభ్యుదయ భావాలతో కూడిన విద్య అందరి బాధ్యత అనే అంశాల గురించి సమావేశంలో చర్చలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో ఎనిమిది తీర్మానాలు చేశారు.
సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాయుడు, యూటీఎఫ్ నాయకులు ఎన్. కుమారరాజా, యన్. తాండవ కృష్ణ, ఎం. కళాధర్, వై. నాగమణి, జి. వెంకటేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, స్థానిక ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్వీ కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
యూటీఎఫ్ నూతన కార్యవర్గం
సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా యు. రాజశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం. కళాధర్, సహాధ్యక్షుడిగా జి వెంకటేశ్వర్లు, మహిళా సహాధ్యక్షులుగా షకీలా బేగం, కోశాధికారిగా గయా శుద్ధవుల, జిల్లా కార్యదర్శులుగా సీహెచ్. ఆదినారాయణ, జి. వెంకటేశ్వరరావు, సాంబశివరావు, కేదార్నాథ్, గోవిందు, రంగారావు. ప్రసాద్ , కామాక్షి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరావు తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
ఘనంగా ముగిసిన యూటీఎఫ్ 51వ జిల్లా మహాసభలు
చంద్రబాబు పాలనలో విద్యా రంగం నిర్వీర్యం
చంద్రబాబు పాలనలో విద్యా రంగం నిర్వీర్యం


