సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలు రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నేతృత్వంలో పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి వేణుమాధవరావు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని కృషి భవన్‌లో నిర్వహించారు. వేణుమాధవరావు మాట్లాడుతూ వ్యవ సాయ విస్తరణాధికారులకు జాబ్ చార్ట్, నామిలికేచర్ మార్పు తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో ఏపీ జేఏసీ సహకారంతో పరిష్కారం అవుతాయన్నారు. జిల్లావ్యవసాయ విస్తరణ అధికారులు తమ సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుభాని గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సురేష్ గోపి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణయ్య పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా కార్యవర్గం
గుంటూరు జిల్లా ఏఈఓ సంఘం అధ్యక్షులుగా ఆలా రమేష్‌బాబు, కార్యదర్శిగా ఎన్ ప్రసాద్‌బాబు, కోశాధికారిగా ఎంఎన్ కృష్ణారావు, సహాధ్యక్షులుగా ఐ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా పి రవికుమార్, ఆర్ వెంకయ్య, వీరంకి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివరావు, ప్రచార కార్యదర్శిగా కె రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శులుగా ఐ జ్యోత్స్న, పి రాజేంద్రప్రసాద్, బి సౌజన్య, కార్యవర్గ సభ్యులుగా దేవ సమర్పణరావు, ఆదిలక్ష్మి, మురళి ఎన్నికై నట్లు ఎన్నికలు ఎన్నికల అధికారి రమణయ్య ఈ సందర్భంగా తెలిపారు.


