ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్‌గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్‌లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్‌లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్‌కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో పురోగతి
పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక డ్రగ్స్ సేవించిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం వరకు... గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్‌లోని లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్న బజార్‌లో నివాసం ఉండే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక మైనర్ బాలికకు కొందరు యువకులు ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. డ్రగ్స్‌కు బానిసగా మార్చడంతో ఆమె తల్లి వంగల స్వప్న ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇన్‌స్ర్ట్రాగామ్ ద్వారా పరిచయమైన కొంతమంది యువకులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు యువకులను గుర్తించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ద్వారా ఇన్‌స్ర్ట్రాగామ్‌లో బాలికకు పరిచయమైన యువకులు అంశాలను పరిశీలిస్తున్నారు. బాలిక చెప్పిన వాస్తవాలు ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వారికి అందుతున్నాయి? ఈ విద్యార్థిని కాకుండా మరెవరికై నా డ్రగ్స్ అందజేస్తున్నారా? రక్షణలో చేస్తున్న యువకులకు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువకులను విచారించే నేపథ్యంలో అసలు నిందితుల కోసం వెతుకులాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను సమాచారం అడగక దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. యువకులను రిమాండ్ కూడా తరలించారని వాదనలు వినవస్తున్నాయి.
ఏపీలో 15 ఏళ్ల తరువాత ఫార్మాసిస్ట్‌ల ఎన్నికలు
గుంటూరు మెడికల్: విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 2025 డిసెంబర్‌లో ఏపీ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..15 ఏళ్లఅనంతరం ఏపీలో ఫార్మాసిస్ట్‌ల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది ఫార్మాసిస్ట్‌లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానల్ అభ్యర్థులైన వేమూరు మాలతి, నరేష్ లుక్కాకు వేయాలని అభ్యర్థించారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారు ఈనెల 24లోపు పోస్టల్ బ్యాలెట్‌లను స్పీడ్ పోస్ట్ ద్వారా విజయవాడలోని ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయానికి చేరేలా చూడాలని కోరారు.
ఈ నెల 24లోపు పోస్టల్
బ్యాలెట్‌లు చేరాలి
యునైటెడ్ రిజిస్టర్ ఫార్మాసిస్ట్ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని వినతి
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ


