పేదలకు వైద్యం, వైద్య విద్య దూరం
చంద్రబాబు పేదవాడికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు వైద్య విద్య దూరం కావడంతో పేదలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేసి ప్రైవేటు కళాశాలలకు ఊతమిచ్చి పేదలను మరింత అణగదొక్కాలని చూడటం అన్యాయం. ఇకనైనా తప్పుడు నిర్ణయాలు పక్కనబెట్టి పేదలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతతో జన సునామీలో బాబు కొట్టుకుపోవడం ఖాయం. తగిన సమయంలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం మరిచిపోరు.
– పరుచూరి నారాయణ,పాములపాడు


