సంతకాల డిజిటలైజేషన్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు పనితీరును వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ప్రజల నుంచి సేకరించిన 65 వేల సంతకాలను విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.


