జిల్లా క్రాస్‌కంట్రీ ఎంపిక పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్ ఎంపికల పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎంపికై న జట్టు కాకినాడలో ఈనెల 24వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు ఏవీ ఆంజనేయులు, కె.అరుణ్ కుమార్, పీఈటీలు శరత్‌బాబు, చక్రి, నాగరాజు, మోహన్, శాప్ అథ్లెటిక్స్ శిక్షకులు శివారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


