ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన పలువురు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించి, వారి విన్నపాలు ఆలకించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణీత వేళల్లో అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అన్నారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదన్‌రావు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు.
టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు
నగరంపాలెం: టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తున్నారని తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు రాత్రిళ్లు ఇంటి తలుపులు కొట్టడం, కాల్ చేయడం వంటివి చేస్తున్నారన్నారు. తన కుమార్తెను, తనను చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.
పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


