మీ కోసం.. మోసమే రైతన్నా! | - | Sakshi
Sakshi News home page

మీ కోసం.. మోసమే రైతన్నా!

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

మీ కోసం.. మోసమే రైతన్నా!

మీ కోసం.. మోసమే రైతన్నా!

మీ కోసం.. మోసమే రైతన్నా! చంద్రబాబు సర్కారు దగాపై అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత

నాడు పండుగలా సాగు

పేరుకే ఘనం

అన్నిటికీ కోతే

హామీల అమలెక్కడ?

చంద్రబాబు సర్కారు దగాపై అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత

అసలు విషయం పక్కన పెట్టి ఆర్భాటాలు చేయడం చంద్రబాబు సర్కారుకు వెన్నతో పెట్టిన విద్యే. ఇదే అంశం మరోమారు రైతుల విషయంలో రుజువైంది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా.. ఆర్భాటంగా కార్యక్రమం అంటూ ఊదరగొట్టింది. రైతన్నా.. మీ కోసం అటూ మోసం చేసింది. చంద్రబాబు సర్కారుపై అన్నదాతల్లో ఉన్న వ్యతిరేకతకు భయపడి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత దూరంగా ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం గుంటూరు జిల్లాలో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. జిల్లాలో అక్కడక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కుబడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎవరి కోసం, ఎందుకు నిర్వహించారో, దాని వల్ల ప్రయోజనం ఏంటో తెలియకుండానే అయిపోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి రైతును కలవడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు చేతిలో పట్టుకుని హడావుడి చేసి గ్రూపు ఫొటోలు దిగి మీడియాకు పంపడానికి పరిమితం అయ్యింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొన్నప్పటికీ వారు కూడా ఉపన్యాసాలకే పరిమితం అయ్యారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొనలేదు. జిల్లాలోని తాడికొండ,తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఒకే ఒక్కసారి పాల్గొన్నారు. రైతులతో ప్రత్యేక యాప్‌ కూడా అక్కడక్కడ ఇన్‌స్టాల్‌ చేయించారు. అధికారులు, రైతులు నామమాత్రంగా పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో రైతులు నిలదీస్తారనే భయంతో పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలకే ఈ కార్యక్రమం పరిమితం అయ్యింది. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాకు ఎసరు, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కనీస పరిహారం అందకపోవడంపై రైతులను మాట్లాడనీయకుండా జాగ్రత్త పడ్డారు. వ్యవసాయం దండగ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మరో మారు రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద సాయం అందని దాదాపు 20 వేల మంది రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు.

రానున్న ఐదేళ్లలో రైతును రాజును చేసేందుకంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి జిల్లాలో రైతుల నుంచి స్పందన కరువైంది. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వం నుంచి మద్దతు ధర అంశాల గురించి ప్రతి రైతు ఇంటికి వెళ్లి తెలియజేయాలన్నది కార్యక్రమం లక్ష్యం. సాగులో యాంత్రీకరణ లాభం, పంట మార్పిడి, ఎరువులు అధిక వినియోగంతో అనర్థాలు, సూచనలు, సలహాలను అందజేయాల్సి ఉంది. రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నది కార్యక్రమ ఉద్దేశం. అయినప్పటికీ ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నిరసనల భయంతో ప్రజాప్రతినిధులు ఒక్క కార్యక్రమంలో పాల్గొని మమ అనిపించారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవలను నిర్వీర్యం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలకు కోతలు పెడుతూ వస్తోంది. రైతు భరోసా కేంద్రాలను అలంకారప్రాయం చేసింది. కియోస్క్‌ మిషన్లను మూలన పడేసింది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేయడంలో ముఖం చాటేసింది. పంటల బీమాకు ఎసరు పెట్టింది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని పరిహాసం చేసింది. మళ్లీ పంటలు వేయాలంటే భయపడేలా చేసింది. ఇలా కూటమి ప్రభుత్వంలో రైతన్నకు చేసిన దగా చెప్పుకుంటూ పోతే చాంతాడులా ఉంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు ఇంటి ముంగిటకే అన్ని సేవలు అందాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఐదు సంవత్సరాలు వెన్నుదన్నుగా నిలిచారు. ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా అండగా నిలిచారు. ప్రకృతి వైపరీత్యాల వేళ తగినంత సాయం అందించారు. రైతు సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి అన్నదాతకు ఆర్థిక భరోసా ఇచ్చారు. నాడు వ్యవసాయం రైతుకు పండుగలా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమ్మో.. వ్యవసాయమా అనేలా చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకే సేవలను తీసుకొచ్చింది. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అన్నదాతల ఖాతాల్లో నేరుగా సీజన్‌కు ఉపయోగపడేలా జమ చేశారు. ఎరువులు, విత్తనాలు తగినన్ని నిత్యం అందుబాటులో ఉండేవి. పంట దిగుబడి వచ్చాక ఏ మాత్రం కష్టపడకుండా రైతులు మద్దతు ధరకే విక్రయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దళారులు, వ్యాపారులు కూడా మోసం చేయకుండా చూశారు.

ఆర్భాటాలకే పరిమితమైన

‘రైతన్నా.. మీ కోసం’

మొక్కుబడి కార్యక్రమంతో

భజనకే పరిమితం

తమను ఆదుకునేందుకు ఏం చేశారని

రైతుల ఆగ్రహం

వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిన

చంద్రబాబు పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement