శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

శాస్త

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రీదత్తాత్రేయుడు, దత్తాత్రేయ పాదాల వద్ద దత్త జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మేడి వృక్షం వద్ద అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత దత్తాత్రేయుని విగ్రహానికి, అలాగే దత్తాత్రేయుని పాదాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశేష అలంకారం చేశారు. భక్తులందరికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తొమ్మిది స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదు గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు తొమ్మిది నమోదయ్యాయి. జిల్లాలోని మేడికొండూరు మండలం వరగాని చెందిన మహిళ (41), గుంటూరు ఏటీ అగ్రహారంనకు చెందిన మహిళ (55), పెదనందిపాడు మండలం కొప్పుర్రుకు చెందిన మహిళ (69), గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన యువకుడు (28), గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన మహిళ (33), గుంటూరు దాసరిపాలెంకు చెందిన వృద్ధురాలు (73), పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన మహిళ (54), ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన మహిళ (36), కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన మహిళ (52) స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నూతనంగా వచ్చిన ఆరు కేసులతో బాధితుల సంఖ్య 37కు చేరుకుంది. డీడీవో కార్యాలయం ప్రారంభోత్సవం గుంటూరులోనూ...

తెనాలి అర్బన్‌: తెనాలి నాజర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో జ్యోతిబస్‌, ఎంపీడీవో అత్తోట దీప్తి, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, తెనాలి డీడీవో కుసుమ శ్రీదేవి మాట్లాడారు. తెనాలి డీడీవో పరిధిలో తెనాలి, పొన్నూరు, చేబ్రోలు, కాకుమాను, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలతో పాటు గ్రామ సచివాలయాలు ఉంటాయన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: జెడ్పీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డీడీవో కార్యాలయాల ఏర్పాటు ద్వారా పరిపాలన సౌలభ్యం లభిస్తుంందని, పరిపాలన వికేంద్రీరణతో ఫైళ్లు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ అదనపు కమిషనర్‌ నాగార్జున, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి. విజయలక్ష్మి, డీపీవో బీవీ నాగసాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు 1
1/3

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు 2
2/3

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు 3
3/3

శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement