రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది

Nov 27 2025 6:25 AM | Updated on Nov 27 2025 6:25 AM

రాజ్య

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది

నగరంపాలెం: రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. కలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్‌ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యంగ దినోత్సవం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను రక్షించే పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ దూరదృష్టి, నిబద్ధత, కృషి వల్లే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతదేశం పొందిందన్నారు. అనంతరం పోలీస్‌ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో..

జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి జిల్లా ఏఎస్పీలు (పరిపాలన) జీవీ.రమణమూర్తి, హనుమంతు (ఏఆర్‌) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్‌ఎస్‌ఐ ఏసురాజు, ఏఓ వెంకటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ రాంబాబు, ఆర్‌ఐ సురేష్‌ పోలీస్‌ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో...

గుంటూరు లీగల్‌: గుంటూరుబార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో రాజ్యాంగ దినోత్సవం బుధవారం నిర్వహించారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంగళశెట్టి శివ సూర్యనారాయణ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ విలువల గురించి వివరించారు. సీనియర్‌ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయన్నా రు. న్యాయవాది రాయపూడి మణి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సమానత్వం రాజ్యాంగం కల్పించిందన్నారు. న్యాయవాదులు పి.కళ్యాణి, మదిర నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌, ఇమ్మడి వెంకట్రావు, ఆనంద్‌, పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో...

గుంటూరు వెస్ట్‌: రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి పునాదని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి తెలిపారు. సంవిధాన్‌ దివస్‌–రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన క్విజ్‌ పోటీ విజేతలైన విద్యార్థులకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో డీఆర్వో, డీఈఓ రేణుక సర్టిఫికెట్లు, మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న దేశంలో ప్రజలందరినీ ఒక్కతాటి మీద నడిపించటం ఒక్క రాజ్యాంగం వల్లే సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో పలువురు విద్యార్థులు రాజ్యాంగంలోని పలు అంశాలను వివరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న 8 మంది జిల్లా విద్యార్థులను డీఆర్‌ఓ అభినందించారు.

లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో...

గుంటూరు రూరల్‌: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌.శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ భారతరాజ్యాంగం పౌరులందరికి ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు, మత ఆరాథనలో స్వేచ్చను కల్పిస్తుందని తెలి ్డపారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీ రమణ, ఇంజినీ రింగ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ ఎ.మణి, అగ్రికల్చర్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.శివన్నారాయణ, కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్‌, కంట్రోలర్‌ డాక్టర్‌ వీఎస్‌ ప్రసాద్‌, జాయింట్‌ రిజిష్ట్రార్‌ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది 1
1/2

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది 2
2/2

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement