జీజీహెచ్‌లో నూతన ఓపీ పీఎస్‌కు భూమిపూజ
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్‌లో ఔట్‌పోస్ట్ పోలీస్‌స్టేషన్ (ఓపీ పీఎస్) పునఃనిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈనెల 18న సాక్షి దినపత్రికలో ‘ఖాకీలకు నిలువ నీడ కరువు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో అత్యవసర సేవల చికిత్సా విభాగం ఎదుట ఖాళీ స్థలంలో సూపరింటెండెంట్ రమణ యశస్వి, దాత నగరంపాలెంలోని నందన ఆసుపత్రి నిర్వాహాక వైద్యురాలు నందన, ఆమె కుటుంబ సభ్యులు హాజరై శంకుస్థాపన చేశారు. పాత ఓపీ పీఎస్‌ను శంకర్‌విలాస్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పునః నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించనున్నారు. నాలుగు నెలల వ్యవధిలో నూతన హంగులతో ఓపీ పీఎస్‌ను నిర్మించేందుకు పనులు చకచకగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సీనియర్ సర్జన్ బాలభాస్కర్, కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్యచౌదరి పాల్గొన్నారు.
బత్తలపల్లి: గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లో అగ్రికల్చర్, కార్పొరేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రేమింద్రావతి బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగ్‌లోని బంగారు నగలు ఉన్న బాక్స్‌ను దుండగులు అపహరించారు. ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో నివాసముంటున్న తన మేనమామ ఇంట శుభకార్యంలో పాల్గొనేందుకు సిద్ధమైన ప్రేమింద్రావతి ఈ నెల 23న తన అత్తింటికి వెళ్లి రెండు బంగారు గాజులు, ఓ జత కమ్మలు తీసుకుంది. వీటిని ఓ బాక్స్‌లో ఉంచి దానిని ల్యాప్‌టాప్‌తో పాటు బ్యాగ్‌లో పెట్టుకుని ఈ నెల 24న కర్నూలు నుంచి బయలుదేరి అనంతపురం మీదుగా అదే రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బత్తలపల్లిలోని నాలుగురోడ్ల కూడలిలో దిగింది. అనంతరం దాడితోటకు వెళ్లేందుకు రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన ఆమె కొంత దూరం వెళ్లిన తర్వాత తన బ్యాగ్‌ను పరిశీలించుకుంది. జిప్‌లు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి బ్యాగ్‌ను పరిశీలించింది. అందులో బంగారు నగలు ఉంచిన బాక్స్ కనిపించలేదు. బస్సు దాడితోటకు చేరిన తర్వాత తన మేనమామకు జరిగిన విషయాన్ని వివరించింది. బుధవారం ఉదయం భర్త తులసీనాథ్‌రెడ్డితో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జీజీహెచ్‌లో నూతన ఓపీ పీఎస్‌కు భూమిపూజ


