పక్షపాతంపై నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

పక్షపాతంపై నిరసన గళం

Nov 27 2025 6:17 AM | Updated on Nov 27 2025 6:17 AM

పక్షప

పక్షపాతంపై నిరసన గళం

పక్షపాతంపై నిరసన గళం గుంటూరు ఎడ్యుకేషన్‌ : జెడ్పీలో అవలంబిస్తున్న పక్షపాత ధోరణి, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవడం ద్వారా వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలు జెడ్పీ పాలకులు, అధికార యంత్రాంగానికి తిరుగులేని గుణపాఠం చెప్పారు. జెడ్పీ కార్యాలయంలో ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం ఆరు స్థాయీ సంఘాలు భేటీ అయ్యి, అజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చించి ఆమోదించాల్సి ఉంది. అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన ఆమె చాంబర్లో నిర్వహించాల్సిన ప్రణాళిక–ఆర్థిక అంశాలతో కూడిన 1వ స్థాయీ సంఘం, గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయీ సంఘం, విద్యం–వైద్యంపై 4వ స్థాయీ సంఘం, పనుల ఆమోదంపై 7వ స్థాయీ సంఘ సమావేశాలను వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1వ, 7వ సమావేశాలకు హాజరైన సభ్యులు తాము అజెండాలను తిరస్కరిస్తున్నామని, తమ ప్రాతినిధ్యం లేకుండా ఏకపక్షంగా ఆమోదిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. వైస్‌ చైర్మన్‌ శొంటి నర్సిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయంపై జరగాల్సిన 3వ స్థాయీ సంఘం కోరం లేక వాయిదా పడింది. సమావేశాలను బహిష్కరించిన అనంతరం వైఎస్సార్‌ సీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నాదెండ్ల, నరసరావుపేట జెడ్పీటీసీలు సభ్యులు కాట్రగడ్డ మస్తాన్‌రావు, పి. చిట్టిబాబులు మాట్లాడుతూ.. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పనులు ఆమోదిస్తున్నారని ఆరోపించారు. స్థాయీ సంఘ సభ్యులకు తెలియకుండా తయారు చేసిన అజెండాను రద్దు పర్చి, సభ్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని, అజెండాను సిద్దం చేసిన తరువాతే మరలా సమావేశాలను నిర్వహించాలిన డిమాండ్‌ చేశారు. మాచవరం జెడ్పీటీసీ జె.వెంకట శివయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా గెలిచిన తాము నాలుగేళ్లుగా సంత మండలంలో పనులు చేయించుకోలేకపోతున్నామని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని అన్నారు. చైర్‌పర్సన్‌, సీఈవోకు మధ్య సరైన అవగాహన లేకపోవడంతో జెడ్పీటీసీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జెడ్పీటీలకు తెలియకుండా చేర్చిన పనులను రద్దు పర్చాలని డిమాండ్‌ చేశారు. రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీ మారిన చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా కూటమి ప్రభుత్వం నుంచి జెడ్పీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావల్సిన నిధులు రూ.23 కోట్లకు కేవలం రూ.తొమ్మిది కోట్లే వచ్చాయని చెప్పారు. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.35 కోట్లు కూటమి ప్రభుత్వం రెవెన్యూ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ చైర్‌పర్సన్‌ చేతకానితనంతో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఎంపీ సమాధానం చెప్పాలి

జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూపొందించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఆమోదం పొందకుండా తాము ఆరు నెలలపాటు అడ్డుకున్నామని తెలిపారు. అయితే జెడ్పీటీసీలకు తెలియకుండా ఎటువంటి పనులు ఆమోదం పొందవని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన హామీతో తాము సర్వసభ్య సమావేశపు అజెండాను ఆమోదించామని తెలిపారు. మళ్లీ పాత పద్ధతిలోనే ఏకపక్షంగా పనులు ఆమోదింపచేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ కృష్ణదేవరాయలు సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. సమావేశంలో కందుల సిద్ధయ్య, సంకటి నాగమల్లేశ్వరి, షేక్‌ గుల్జార్‌ బేగం, మూలగొండ్ల కృష్ణకుమారి, తుమ్మల సుబ్బారావు, తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

నామమాత్రంగా సమావేశాలా?

నిధులు తెచ్చుకోలేని పరిస్థితి

జెడ్పీలో పనులన్నీ మీరే

కేటాయించుకుంటే ఇక

ప్రజాప్రతినిధులుగా మేమెందుకు?

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను

బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు

రాజ్యాంగ దినోత్సవం రోజు

జెడ్పీటీసీలకు అవమానం

ప్రణాళిక–ఆర్థిక, పనుల ఆమోదానికి

సంబంధించిన కమిటీలు బహిష్కరణ

తమ మండలాలకు పనులు

కేటాయించలేదని మండిపాటు

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న

చైర్‌పర్సన్‌ వైఖరిపై ఆగ్రహం

ప్రభుత్వం నుంచి నిధులు

తెచ్చుకోలేని పరిస్థితుల్లో చైర్‌పర్సన్‌

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌లో కొనసాగుతున్న వ్యవహారాలను వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ, జెడ్పీ యంత్రాంగం ఏకపక్ష వైఖరిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు బహిష్కరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ మొత్తం ఆరు సమావేశాలకుగానూ మూడు స్థాయి సంఘ సమావేశాలను బహిష్కరించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా తయారు చేసిన అజెండాలను తిరస్కరించారు.

పక్షపాతంపై నిరసన గళం1
1/1

పక్షపాతంపై నిరసన గళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement