ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే దిక్సూచీ
●చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గౌరవం లేదు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే సీఎం చంద్రబాబుకు గౌరవం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్‌గార్డెన్స్‌లో జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే అది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పుణ్యమేనన్నారు. గత ప్రభుత్వ హాయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలవడంతో పాటు..విజయవాడ నడిబోడ్డులో అంబేడ్కర్ స్మృతి వనం నిర్మిస్తే..ఈనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతి వనం విజయవాడలో నిర్మిస్తారా అంటూ వనంపై దాడి చేయడంతో పాటు స్మతివనాన్ని ఆవిష్కరించిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేసినవారిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
– ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాల వారు ఉన్నప్పటికి వారందరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమకాలీన రాజ్యాంగం రచించడం ద్వారానే ఈనాడు దేశం సుభిక్ష ఉందన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు) మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎన్నో కష్టాలు పడి రాజ్యాంగాన్ని రచించారని..దాని ఫలితంగా అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు.


