బిల్లులు చెల్లించాలని కమిషనర్‌ను నిలదీసిన కాంట్రాక్టర్ల
● వాటి సంగతి తేల్చాకే కొత్త అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలని హితవు
● సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన
కాంట్రాక్టర్లు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు శనివారం కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సదరు సమావేశంలో ముందుగా ఎన్ని వర్కులు పెండింగ్‌లో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కాంట్రాక్టర్లను అడిగారు. ముందుగా తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వర్కులు చేస్తామని వారు పట్టుబట్టారు. కమిషనర్ ఎంతకీ బిల్లులు గురించి, వర్కుల గురించే మాట్లాడతుండటంతో చేసేదేమి కాంట్రాక్టర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతోనే సమావేశం నిర్వహించుకున్నారు. జనవరి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉంటే ఇప్పుడు సమీక్షలు అంటే ఎలా అని వాకౌట్ చేసిన కాంట్రాక్టర్లు మండిపడ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు చేయకుండా రివ్యూ సమావేశం పెడితే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు.


