వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
అండర్–14 జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్స్ గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్‌రోడ్డులోగల శుభం క్రికెట్ అకాడమీలో పెదకాకాని జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–14 బాలురు, అండర్–17 బాలలు, బాలికల జిల్లాస్థాయి క్రికెట్ సెలక్షన్స్ శనివారం నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిభకలిగిన క్రీడాకారులను అండర్–14 బాయ్స్, అండర్–17 బాయ్స్, బాలికలు క్యాటగిరీలో సెలక్షన్ చేశారు. అండర్–14 బాయ్స్ ఈ నెలాఖరులో గుంటూరు జిల్లాలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పెదకాకాని హైస్కూల్ హెచ్‌ఎం భాస్కరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు భూపాల్ రెడ్డి, టి.లక్ష్మిపతిలు తెలిపారు.
రూ.10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌ను రాష్ట్రంలోనే మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, కార్పొరేట్ ఆసుపత్రులకంటే దీటుగా పేదలకు వైద్య సేవలు అందించేలా చూస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రూ.10 కోట్లతో అజీజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణ పనుల కోసం శనివారం ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకున్నారు. డెక్కన్ టుబాకో ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ తన తండ్రి అజీజ్ ఖాన్ పేరు మీదుగా భవనిర్మాణం చేపట్టేందుకు రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. ఈనేపథ్యంలో శనివారం షఫిక్‌ఖాన్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, భవన నిర్మాణ దాత, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ మాట్లాడారు. డీఎంఈ డాక్టర్ రఘునందన్, దాత షఫిక్‌ఖాన్‌లు భవన నిర్మాణ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, హెచ్‌డీఎస్ సభ్యులు, సీనియర్ ఐవీఎఫ్ స్పెషలిస్టు డాక్టర్ ఉమాశంకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, చిన్నం సుధారాణి పాల్గొన్నారు.
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్ర అవతరణ దినోత్సవం శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, అనుబంధ విభాగాల నాయకులు అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయజెండా ఎగురవేశారు. పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనుబంధ విభాగాల నాయకులు యు.పిచ్చిరెడ్డి, బత్తుల దేవానంద్, పఠాన్ సైదాఖాన్, మద్దు జ్యోతిబాబు, నాయకులు పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో ఒప్పంద పత్రాలు మార్చుకున్న అధికారులు
1/1
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం