టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
తాడికొండ: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తుళ్లూరు మండలం టిడ్కో గృహాల వద్ద జరిగింది. వివరాల ప్రకారం... తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం నుంచి తోరటి గోపీ(35) ద్విచక్ర వాహనంపై సీడ్ యాక్సిస్ రోడ్డుపై వస్తుండగా టిడ్కో గృహాల సమీపంలో ఈ3– ఎన్ 16 జంక్షన్ వద్దకు రాగానే టిప్పర్ వచ్చి ఢీకొంది. అతని తలకు బలమైన గాయమై చనిపోయాడు. సంఘటనా స్థలానికి తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంక్షన్ వద్ద రోడ్డుపైకి వచ్చే క్రమంలో నిర్మించిన షెడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదా స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేసి చర్యలు తీసుకోపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.


