
కవి మాధవరావుకు కళామిత్ర సాహితీ అవార్డు
తాడికొండ: తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ప్రముఖ కవి బండ్ల మాధవరావుకు ఒంగోలు కళామిత్ర మండలి వారి కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం అందజేస్తున్నట్లు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఎన్‌టీఆర్ కళాక్షేత్రంలో నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు.
24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: మేడికొండూరు మండలం విశదలలోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యా విధానంలో మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించే విద్య అవసరమని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పరచి, ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 24న మధ్యాహ్నం 2.00 గంటలకు సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో ముఖ్యఅతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంట్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్‌కుమార్ పాల్గొని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్‘ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు చెప్పారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుర్రా శరత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్‌బాబు పాల్గొన్నారు.
24న జిల్లా ఫుట్‌బాల్ జట్ల ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాల, బాలికల ఫుట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24వ తేదీ కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మఽ ద్యాహ్నం 12.30 గంటల వరకు అండర్–14 బాల, బాలికల జట్ల ఎంపిక, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అండర్–17 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని వివరించారు.