అమరవీరుల వీరోచిత త్యాగాలు మరువలేం
ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అమరవీరులకు నివాళి
నగరంపాలెం: సమాజ రక్షణ, దేశ భద్రతకై ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల వీరోచిత త్యాగాలను ఎప్పటికీ మరువలేమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. మంగళవారం నగరంపాలెంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. తొలుత అమరవీరుల కుటుంబ సభ్యులతో కలసి స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అరవింద్ (పశ్చిమ), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్‌బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఆర్‌ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, పోలీస్ అధికార, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజలకు ఉత్తమ సేవలు
కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితం వల్లే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో జిల్లాలోని పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చదువుతున్నారంటూ వారి బాగోగులపై జిల్లా ఎస్పీ ఆరాతీశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు అందించారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), ఆర్‌ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ , పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కందుకూరు బైపాస్‌లో అంబటి మురళిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదం
అమరవీరుల వీరోచిత త్యాగాలు మరువలేం


