
అమృతరావు త్యాగం వృథా కాదు
మేడికొండూరు: విశాఖ ఉక్కుకోసం ఆమరణ దీక్ష చేసి రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీని సాధించిన తమనంపల్లి అమృతరావు త్యాగం వృథా కాదని ఆయన మనువడు, వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపల్లి శాంతయ్య చెప్పారు. మేడికొండూరు మండలంలోని అమృతరావు స్వగ్రామం విశదలలో మంగళవారం ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతయ్య మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ ప్రధాని మోదీకి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ ఉక్కు కార్మికులకు ఇటీవల వైఎస్ జగన్ భరోసా ఇచ్చిన విషయాన్ని కూడా శాంతయ్య గుర్తు చేశారు. పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు నాయకత్వంలో పార్టీని మరింత సమర్థంగా ముందుకుతీసుకెళుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రామంలోని తమనంపల్లి అమృతరావు విగ్రహం వద్ద నేతలు నివాళులర్పించారు. అనంతరం ఆయన బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో మేడికొండూరు, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య, కత్రేణమ్మ, మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి వంశీ, శివారెడ్డి, పోలారెడ్డి, మైనేని నాగమల్లేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, రెడ్డి కొరివి చెన్నయ్య, షేక్ రబ్బాని, గండికోట రసూలు జిలాని, ముత్యాల బాలస్వామి, ఉడతా ప్రభాకర్, షేక్ బాజీ సుబ్బారెడ్డి, ఉడతా శ్రీనివాసరావు, పాములపాటి జయరావు, జి.రవి, షేక్ షరీఫ్, దయాకర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతయ్య