
తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
గుంటూరు రూరల్: రూరల్ మండలంలోని తురకపాలెంలో ఆకస్మిక మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉందని తెలిపారు.