
ఎన్‌ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్‌వోసీ క్లియరెన్‌్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్‌మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్. జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్‌ఎఫ్‌వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్‌బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. మేనేజ్‌మెంట్స్, ఫారమ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్‌వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుపెన్సీ ఎన్‌వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్‌వోసీ 21 రోజులలో జారీ చేయాలని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు.