
గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌జిందాల్
నగరంపాలెం: గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌జిందాల్ నియమితులయ్యారు. 2016 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఏఎస్పీగా రంపచోడవరం, కృష్ణా జిల్లా సెబ్‌లో విధులు నిర్వర్తించారు. ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత సీఎం సెక్యూరిటీగా, బాపట్ల జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించారు. విజయనగరం జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్న వకుల్‌జిందాల్ శనివారం గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక్కడ ఎస్పీగా ఉన్న సతీష్‌కుమార్‌ను శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. సతీష్‌కుమార్ సుమారు 14 నెలలపాటు విధులు నిర్వర్తించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాకు వివిధ కంపెనీల నుంచి 675 మెట్రిక్ టన్నుల ఎరువులు శనివారం సరఫరా అయ్యాయి. స్థానిక రెడ్డిపాలెం రైల్వేస్టేషన్ రేక్ పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, గుంటూరు ఏడీఏ ఎన్.మోహనరావులు పరిశీలించారు. గుజరాత్ రాష్ట్ర ఫెర్టిలైజర్స్ కెమికల్స్(జీఎస్‌ఎఫ్‌సీ) కంపెనీకి చెందిన యూరియా 375 మెట్రిక్ టన్నులు, ఐపీఎల్ కంపెనీకి చెందిన డీఏపీ 300 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో యూరియాను మార్క్‌ఫెడ్‌కు 150 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్స్‌కు 150 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు డీఏఓ వెల్లడించారు. జిల్లాకు వచ్చిన 375 మెట్రిక్ టన్నుల డీఏపీని మార్క్‌ఫెడ్‌కు 322 మెట్రిక్ టన్నులు, 53 మెట్రిక్ టన్నులు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు.
సంగం డెయిరీ క్వార్టర్స్ సమీపంలో ఘటన
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ క్వార్టర్స్ సమీపంలోని గుంతలో పడి బాలుడు మరణించిన సంఘటన శనివారం జరిగింది. వేమూరు సమీపంలోని రావికంపాడు గ్రామానికి చెందిన మధు కుటుంబం డెయిరీ క్వార్టర్స్‌లో ఉంటూ సంగం డెయిరీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం మధు కుమారుడు గోపి (8) మిగతా పిల్లలతో క్వార్టర్స్ సమీప ప్రాంతంలో ఆడుకుంటున్నాడు. బయట ఉన్న గుంతలో పడి మరణించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఏమీ చేయలేదని ఎస్‌ఐ వీరనారాయణ తెలిపారు.
దుగ్గిరాల: రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించామని ప్రభుత్వ సలహాదారు తోట ప్రభాకర్ రావు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించి సూచనలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఇంజినీర్ల బృందం ఆయా పనులకు పరిశీలించింది. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అధ్యయన బృందాలు ఈ నెల 16వ తేదీన గుంటూరు నగరానికి రానున్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పారిశుద్ధ్యం మెరుగుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అందరూ అంకిత భావంతో కృషి చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు ిసీహెచ్ శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్‌చార్జి ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌జిందాల్

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌జిందాల్