
సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేలా విధులు నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఎక్కువ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటానన్నారు. అనంతరం కలెక్టర్‌ను సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, డీఆర్వో ఎస్‌కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, ఆర్‌డీడీఏ పీడీ విజయలక్ష్మి, డీఈఓ ఇ.రేణుక, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మురళీధర్, డీపీఓ నాగ సాయికుమార్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దుర్గాబాయి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, హార్టికల్చర్ డీడీ రవీంద్రబాబు, కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
జిల్లా యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా