
వైఎస్సార్ సీపీ నాయకుడు అంజి అక్రమ అరెస్టు
చెట్టుపై పడిన పిడుగు
మాచవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి మాచవరం సెయింట్ ఆనన్స్ లయోలా ప్రేమ నిలయం హాస్టల్ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై శనివారం పిడుగు పడింది. ఆ సమయంలో విద్యార్థులందరూ హాస్టల్ గదుల్లోనే ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని సిస్టర్ కవిత తెలిపారు. పిడుగు పడిన సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు కంకర గుంట వద్ద శనివారం రాత్రి రైలు కింద పడి ఓ యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మాచర్ల ప్యాసింజర్ రైలు కంకర గుంట గేటు వద్దకు చేరుకోగానే ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉండటంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం తెలియజేయాలని తెలిపారు.

వైఎస్సార్ సీపీ నాయకుడు అంజి అక్రమ అరెస్టు