
డాక్టర్ జగదీష్‌రెడ్డికి బంగారు పతకం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉయ్యూరు జగదీష్‌రెడ్డికి గోల్డ్‌మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ ఎం.ఆర్.సి.నాయుడు గోల్డ్‌మెడల్, ప్రశంసా పత్రాన్ని డాక్టర్ జగదీష్‌రెడ్డి స్వీకరించారు. డాక్టర్ జగదీష్‌రెడ్డి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో న్యూరో సర్జరీలో సూపర్‌స్పెషాలిటీ పీజీ అభ్యసించారు. పీజీ కోర్సులో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గోల్డ్ మెడల్ లభించింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, న్యూరో సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి, పలువురు న్యూరో సర్జన్లు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.