అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి? | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?

Sep 10 2025 2:13 AM | Updated on Sep 10 2025 2:13 AM

అర్ధర

అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?

అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?

నగరంపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బాధలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపుమేరకు అన్నదాత పోరు చేపట్టామని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఓ మహిళా పోలీస్‌ అధికారిణి మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు, ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అన్నదాత పోరు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో అనుమతి కోసం లెటర్లు పెట్టామని గుర్తుచేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో రెండు వ్యాన్లల్లో పోలీసులు తమ ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. తలుపులు కొట్టడంతో తన భార్య, మనవరాళ్లు భయపడిపోయారని అన్నారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు రావడం ఏంటని నిద్ర లేచి వచ్చానని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంతో ఉదయం వేళ రావాలని పోలీసులకు చెప్పానని తెలిపారు. అయినా ఇదేమి పద్ధతి అని, చట్టబద్ధమైన పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు దొంగల్లా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం వేళ ఇంటికి రావచ్చునని లేదా ఆదివారం రాత్రి 8లోపు నోటీసులు జారీ చేయవచ్చునని అన్నారు. కేవలం భయభ్రాంతులకు గురిచేయాలనే పోలీసులు వచ్చారని మండిపడ్డారు. అన్నదాతల కోసం తాము పోరాటం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం కానేకాదని స్పష్టం చేశారు. అణచివేయాలనే ధోరణితో పోలీసులు వ్యవహరించడం దురదృష్టకరమని ఆరోపించారు. ఒకవేళ నోటీసులు ఇవ్వాలంటే కబురు పంపితే పోలీస్‌స్టేషన్‌కు స్వయంగా వస్తానని చాలా సందర్భాల్లో చెప్పానని అంబటి గుర్తుచేశారు. అరెస్ట్‌ చేయాలనుకున్నా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అరెస్ట్‌ అవుతానని స్పష్టం చేశారు. అర్ధరాత్రుళ్లు ఇళ్లకు రావడం ఏంటని నిలదీశారు. దొంగలు, రౌడీల్లాగా వ్యవహరించడంపై మండిపడ్డారు. తమాషాలు అనుకుంటున్నారని, గతంలో తాము కూడా రాష్ట్రాన్ని పరిపాలించామని, మంత్రిగా చేశానని గుర్తుచేశారు. చట్ట పరిధిలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు రెండు రోజులు ముందు వచ్చి నోటీసులు జారీ చేయవచ్చుగా అని ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమీపాన టెంట్‌లను పోలీసులు కూల్చివేయడంపైనా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు చెబుతున్నట్టు వింటున్న పోలీసులు తర్వాత ఇబ్బంది పడతారని హెచ్చరించారు. అనుమతిస్తే అన్నదాత తరఫున పోరాటం చేస్తామని, లేదంటే పోలీసులతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పోలీసుల పేరిట అణచివేత యత్నం సిగ్గుచేటు

పట్నంబజారు: అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమాకు ఆంక్షలు విధించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేశారు. 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు తెలిపేందుకు అనుమతి లేదని తెలిపారు. పాతగుంటూరు పోలీసులు మంగళదాస్‌నగర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. సానుకూలంగా స్పందించిన నూరిఫాతిమా పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మా ట్లాడుతూ.. రైతన్నల సమస్యలు పరిష్కరించలేని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేత యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు, ప్రజల పక్షాన ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడేందుకు ఏ మాత్రం వెనుకాడమన్నారు. అక్రమ కేసులు, నోటీసులు, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, వైస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు అంబటి రాంబాబు

రెండు రోజులు ముందు వచ్చి

నోటీసులు జారీ చేయవచ్చని వ్యాఖ్య

ఇవ్వాలనుకుంటే స్టేషన్‌కు తామే

వచ్చి తీసుకుంటామని స్పష్టీకరణ

అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి? 1
1/1

అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement