మరణాలపై వీడని మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

మరణాలపై వీడని మిస్టరీ

Sep 6 2025 5:39 AM | Updated on Sep 6 2025 5:39 AM

మరణాల

మరణాలపై వీడని మిస్టరీ

● జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి గ్రామాన్ని శుక్రవారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. గ్రామంలో 59 మంది రక్తనమూనాలు సేకరించి, పరీక్షలు చేశామని తెలిపారు. ఫలితాలు అనుమానించదగినవిగా లేవని, నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. ● కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని, మెలియాయిడోసిస్‌ అనేది చాలా అరుదైన వ్యాధి అన్నారు. గ్రామంలో ఎవరికీ సరైన అవగాహన లేకపోవడంతో తెలుసుకునేందుకు సమయం పడుతుందన్నారు. ● రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ గ్రామస్తులకు రక్త పరీక్షలు చేస్తున్నారని, మెలిడాయిసిస్‌ బ్యాక్టీరిృయా ఉన్నట్లు పరీక్ష ఫలితాలు రాలేదన్నారు. బ్యాక్టరీయా అనేది ఇంత వరకు అంతుచిక్కలేదని ప్రకటించారు.

భయం గుప్పెట్లో తురకపాలెం వ్యాధి నిర్ధారణ చేయలేకపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిది ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ వైరస్‌ లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటన వైరస్‌ ఉందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని వెల్లడి రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని డీఎంహెచ్‌ఓ స్టేట్‌మెంట్‌ నెలల తరబడి చావులను కప్పి పెట్టింది ఎవరు? నివేదిక సమర్పించకుండా ఎందుకు దాచి పెట్టారు ? అధికారుల నిర్లక్ష్యానికి గ్రామం బలి అవ్వాల్సిందేనా ? వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తుల ఆవేదన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు సర్వత్రా విఫలం

సాక్షి ప్రతినిధి, గుంటూరు / గుంటూరు మెడికల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. రాష్ట్ర ప్రజ్రాప్రతినిధులు సైతం గ్రామ బాట పట్టారు. మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా.. ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. మేమున్నామంటూ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాందోళనలు రవ్వంత కూడా తొలగిపోలేదు. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?ఎక్కడ లోపం జరిగింది ?అనే విషయాలు ఎవరూ తేల్చలేదు. కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, అధికార యంత్రాంగం నిద్రమత్తులో తూలుతుండటంతో గ్రామం వల్లకాడును తలపిస్తోంది.

భిన్న ప్రకటనలతో గందరగోళం

మరణాలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ ?

రెండు నెలలుగా గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. రెండు నెలల అనంతరం కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యాధికి గల కారణాలు, అందుకు అందుబాటులో ఉన్న చికిత్సలు, సదరు చికిత్సలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేటతెల్లంగా కనిపించే వరకు తురకపాలెం గ్రామస్తులు నిద్రపోయే పరిస్థితి లేదు.

వైద్య ఆరోగ్య శాఖ నిర్లిప్తత

గ్రామంలో ఏదైనా విపత్కర పరిస్థితులు తక్షణ కర్తవ్యంగా జిల్లా వైద్య అధికారులు జరుగుతున్న సంఘటనలపై జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసి, అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మరణాల గురించి మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వరకు చలనం లేదు. విపత్తులు అంచనాలు వేసేందుకు ఐడీఎస్‌పీ విభాగం ప్రత్యేకంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉంది. సదరు విభాగం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం వల్లే రెండు నెలలుగా గ్రామం వల్లకాడుగా మారింది. గుంటూరు వైద్య కళాశాల ఎస్‌పీఎం వైద్య విభాగం సైతం విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు గ్రామాలకు వెళ్లి వ్యాధులకు కారణాలు, మరణాలకు కారణాలు విశ్లేషించాలి. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించి, మరణాలు, వ్యాధుల కట్టడికి కృషి చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది. ఎస్‌పీఎం వైద్య విభాగం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం వల్లే నేడు ఓ చిన్న గ్రామం రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు నిలయంగా మారింది. లక్షలాది మంది ప్రజల్లో భయాందోళనకు కారణంగా నిలిచింది.

మరణాలపై వీడని మిస్టరీ 1
1/1

మరణాలపై వీడని మిస్టరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement