
శోభిల్లిన ధన గణపతి
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కారొరేషన్(ఎంటీఎంసీ) పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడిని శుక్రవారం రూ 17.55లక్షల కరెన్సీ నోట్లతో లక్ష్మీ గణపతిగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ప్రతినిధులు లేళ్ల నరసింహారావు, గుండాల సాయి, పాశం శ్రీరామ్ పర్యవేక్షించారు.
– యర్రబాలెం(మంగళగిరి)