
నిమజ్జనానికి తరలిన ‘జెడ్పీ’ గణేశుడు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో కొలువైన విఘ్నేశ్వరుడు సోమవారం నిమజ్జనానికి బయలుదేరాడు. ఎనిమిదవ గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన నిమజ్జనోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ దంపతులు గణేష్ మండపం వద్ద కొబ్బరికాయ కొట్టి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం మేళతాళాలతో నిమజ్జనానికి విఘ్నేశ్వరుని తరలించారు. వేలంలో నంబూరు నిర్మల భారతి లడ్డూను రూ.45 వేలకు దక్కించుకున్నారు. వేలంను ఉద్యోగులు ఉషాదేవి, అహ్మద్ నిర్వహించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, పంచాయతీరాజ్ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు డాక్టర్ కూచిపూడి మోహన్, జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.