
సమస్యలు పరిష్కరించకుంటే బలిదానాలకు సిద్ధం
గుంటూరు వెస్ట్: సీపీఎస్, జీపీఎస్‌లను రద్దు చేయకపోతే బలిదానాలకు సైతం తాము సిద్ధమవుతామని గుంటూరు జిల్లా ఐక్య వేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ఉద్యోగ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చాంద్ బాషా మాట్లాడుతూ సీపీఎస్‌తోనే సతమతమవుతుంటే జీపీఎస్ కూడా తెచ్చి మమ్మల్ని దారుణంగా దెబ్బతీసారన్నారు. ప్రజలకు దాదాపుగా 40 ఏళ్లు సేవచేస్తే మాపై ఎందుకింత కక్షని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను అంగీకరించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, పెదరత్త య్య, సుమిత్రా, పద్మజ, ఆలీసు, షబనా పాల్గొన్నారు.
జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా