
అయ్యో.. ఎంత కష్టం తల్లీ!
ఒక చేతిలో స్ట్రెచ్చర్.. మరో చేతిలో గ్యాస్ సిలిండర్.. భర్తను బతికించుకునేందుకు ఓ భార్య పడిన పాట్లు ఇవీ. బాబ్బాబూ.. కాస్త వార్డు దాకా లాగండయ్యా.. పుణ్యముంటుంది అని బతిమాలితే.. పుణ్యం కాదు పైసలున్నాయా.. అని చూసే వార్డు బాయ్‌లు.. కదిలిస్తే చాలు.. కయ్యని కసురుకునే ఆయమ్మల నడుమ.. ఇవన్నీ ఎందుకులే అనుకుంటూ భారమైనా.. సత్తువ లేకున్నా.. లాగలేకున్నా.. రొప్పుతూ.. రోడ్చుతూ.. ఎలాగోలా సిలిండర్‌తోపాటు బండి లాగుతూ.. ఓ మహిళ పడిన కష్టమిది. వందలాది మంది సిబ్బంది పనిచేసే సర్వజనాసుపత్రిలో సోమవారం కనిపించిన హృదయ విదారక దృశ్యమిది.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
గుంటూరు