
పాఠశాలలకు బహుమతులు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లాలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2025కు ఎంపికై న ఐదు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందించారు. శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెచ్‌ఎం, ఫిజికల్ డైరెక్టర్లను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఎంపికై న వాటిలో ప్రథమ స్థానంలో మంగళగిరి మండలం నవులూరు జెడ్పీ హైస్కూల్, తరువాతి స్థానాల్లో వట్టిచెరుకూరు మండలం పల్లపాడు, మంగళగిరి మండలం నూతక్కి, పెదకాకాని మండలం ఉప్పలపాడు, చేబ్రోలు మండలం నారాకోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు నిలిచాయి, కార్యక్రమంలో గుంటూరు ఆర్‌ఐపీఈ మహబూబ్ బాషా, ఏపీ పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బి. కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా కార్యదర్శి సీహెచ్ కొండయ్య, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మెల్లంపూడి రవి పాల్గొన్నారు.